News November 8, 2025

కేశాలకు కర్పూరం

image

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ఒకటే ఈ కర్పూరం నూనె. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి తర్వాత రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

Similar News

News March 29, 2026

IPL: టాస్ గెలిచిన MI

image

ముంబైలోని వాంఖడే స్టేడియంలో KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్టన్, తిలక్, హార్దిక్, రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్, మార్కండే, ఘజన్‌ఫర్, బౌల్ట్, బుమ్రా
KKR: అలెన్, రహానే, గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్‌దీప్, అనుకుల్ రాయ్, నరైన్, వరుణ్, అరోరా, ముజరబానీ

News March 29, 2026

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫలితాలు విడుదల

image

TG: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 1న HYDలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో గైనకాలజీ, అనస్తీషియా వంటి కీలక విభాగాలున్నాయి. ఇక 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను ఏప్రిల్ 9న వెల్లడిస్తామని రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ నియామకాలతో ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

News March 29, 2026

మహిళలకు రూ.2 వేలు, రైతులకు పంపుసెట్లు: DMK మ్యానిఫెస్టో

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికార డీఎంకే వరాల జల్లు కురిపించింది. మహిళలకు ప్రతి నెలా ₹2 వేలు ఇస్తామని ప్రకటించింది. పెన్షన్‌ను ₹2 వేలకు పెంచుతామని, రైతులకు ఉచితంగా పంపుసెట్లు అందజేస్తామని తెలిపింది. మహిళా సంఘాలకు ₹5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామని పేర్కొంది. స్టూడెంట్లకు ఫ్రీగా ల్యాప్‌టాప్‌లు, 8వ తరగతి వరకు పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తామని వెల్లడించింది.