News January 14, 2026

కేశాలకు కర్పూరం

image

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కర్పూరం నూనెను వాడాలంటున్నారు నిపుణులు. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు రాసి తర్వాత రోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తెల్ల జుట్టును తగ్గించడంలోనూ కర్పూరం ఉపయోగపడుతుంది.

Similar News

News March 30, 2026

US స్థావరాలపై దాడుల్లో ఇరాన్‌కు రష్యా సహకారం: జెలెన్‌స్కీ

image

సౌదీ అరేబియాలోని US స్థావరాలపై ఇరాన్ చేపట్టిన దాడి వెనుక రష్యా సహకారం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇరాన్‌కు రష్యా 100% సహకరిస్తోందన్నారు. మార్చి 20, 23, 25 తేదీల్లో సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌‌ శాటిలైట్ చిత్రాలను రష్యా క్యాప్చర్ చేసిందని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువసార్లు అలా శాటిలైట్ ఇమేజెస్‌ను రష్యా సాధారణంగా సేకరించదని పేర్కొన్నారు.

News March 30, 2026

ఏప్రిల్ 20 నుంచి 60% సీట్లకు అదనపు ఛార్జీలు ఉండవు: DGCA

image

విమానాల్లో ఇకపై 60% సీట్లకు అదనపు ఛార్జీలు ఉండవని డీజీసీఏ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీనిపై విమానయాన సంస్థలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించింది. కాగా ప్రస్తుతం ఈ ఫ్రీ సీట్ కోటా 20%కు పరిమితమైంది. మిగతా సీట్లకు టికెట్‌కు అదనంగా ₹200 నుంచి ₹2100 వరకు సంస్థలు ఛార్జ్ చేస్తున్నాయి. తాజా ఆదేశాలతో ఛార్జ్ లేకుండా సీట్‌ ఎంచుకునే వెసులుబాటు పెరుగుతుంది.

News March 30, 2026

మార్చి 30: చరిత్రలో ఈరోజు

image

* 1908: తొలి తరం భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి మహిళ దేవికారాణి జననం (ఫొటోలో)
* 1935: తెలుగు రచయిత తంగిరాల వెంకట సుబ్బారావు జననం
* 1948: ప్రతినాయకుడు కన్నడ ప్రభాకర్ జననం
* 1971: తొలి తెలుగు సినిమా హీరోయిన్ సురభి కమలాబాయి మరణం
* 2011: సినీ నటుడు నూతన్ ప్రసాద్ మరణం
* ప్రపంచ ఇడ్లీ దినోత్సవం