News July 11, 2024
కేసముద్రం: బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థినికి గాయాలు
కేసముద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఓ విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన విద్యార్థినిని సిబ్బంది ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 9వ తరగతి చదువుతున్న ఆమె.. వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లింది. తిరిగి బుధవారం హాస్టల్లో చేరగా.. సా.5గం. ప్రాంతంలో గురుకులంలోని ఒకటో అంతస్తు పైనుంచి కిందపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 29, 2024
WGL: జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్, ఛైర్మన్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాకతీయ మెడికల్ కాలేజి ఎన్ఆర్ఐ మిలినియం ఆడిటోరియంలో సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. విజయోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డీపీఆర్‌వో ఆయుబ్ అలీతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
News November 29, 2024
మండలంగా మల్లంపల్లి.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సీతక్క
ములుగు జిల్లాలోని మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ జీవో విడుదల కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం హర్షనీయమని, కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని నిరూపించడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.
News November 28, 2024
డివిజన్ హోదాను కల్పించేందుకు కార్యాచరణను ప్రారంభించడం గర్వకారణం: మంత్రి
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఒక్కో హామీని పోరాడి సాధించుకుంటున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్‌కు డివిజన్ హోదాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించడం యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి సురేఖ అన్నారు.