News March 17, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఉత్పత్తుల ధరలు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఉత్పత్తుల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. ✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2223. కనిష్ఠం: 2223. ✓ ధాన్యం(JSR): గరిష్ఠం: 2555. కనిష్ఠం: 2555. ✓ ధాన్యం(HMT): గరిష్ఠం: 2359. కనిష్ఠం: 2163. ✓ పత్తి: గరిష్ఠం: 6871. కనిష్ఠం: 3222. ✓ మక్కలు: గరిష్ఠం: 2236. కనిష్ఠం: 2156.✓ తేజా మిర్చి: గరిష్ఠం: 13,501. కనిష్ఠం: 8302.✓ తేజా తాలు: గరిష్ఠం: 7,744. కనిష్ఠం: 4602.
Similar News
News March 17, 2025
MBNR: ప్రజావాణికి 130 ఫిర్యాదులు

ప్రజావాణికి 130 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
News March 17, 2025
కృష్ణా: ప్రజా సమస్యలు పరిష్కరించండి- ఎస్పీ

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్ గంగాధర రావు పాల్గొని 44 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.
News March 17, 2025
కథలాపూర్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో కాసారపు రాజగంగు (50) అనే మహిళ ఉరేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. భర్తతో పాటు కుమారుడు ఏమి పని చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు తలెత్తాయన్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని, ఆవేదనతో సోమవారం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.