News February 17, 2025

కేసీఆర్‌కు కరీంనగర్‌తో విడదీయరాని బంధం

image

కరీంనగర్ అంటేనే.. కేసీఆర్ అని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటాయి. KCRకు KNR జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటుచేయనున్నట్లు 2001లో KNR గడ్డపైనే ప్రకటించారు. 2004లో KNR నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2018, మే 10న రైతుబంధును ఇక్కడే ప్రారంభించారు. త్వరలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను కరీంనగర్‌లోనే ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్.

Similar News

News December 17, 2025

నంద్యాల: ఈనెల 23న జాబ్ మేళా

image

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని టీడీపీ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్ అన్నారు. నంద్యాలలో ఈ నెల 2న స్థానిక నేషనల్ డిగ్రీ కాలేజీలో ఉదయం 9 గంటలకు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లుపేర్కొన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్‌ను జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి విడుదల చేశారు.

News December 17, 2025

ధనుర్మాసం: ఏయే పూజలకు ఏయే ఫలితాలు?

image

ధనుర్మాసంలో వైష్ణవాలయాన్ని దర్శించాలని పండితులు సూచిస్తున్నారు. గంధాన్ని భక్తులకు పంచితే మంచి జరుగుతుందని అంటున్నారు. అగ్నిపురాణం ప్రకారం.. ఆలయానికి శక్తి కొలది దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. సంపంగి పూలతో విష్ణును పూజిస్తే కుజదోషం పోతుంది. ఏజ్ పెరిగినా.. పెళ్లికాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. తెల్లగన్నేరు పూలతో స్వామిని అర్చిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.

News December 17, 2025

నేడే మూడో విడత పోలింగ్

image

TG: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సర్పంచ్ బరిలో 12,652 మంది, వార్డుల బరిలో 75,725 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరి విడతలో 53,06,395 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడత ఎన్నికల వేళ రూ.9.11 కోట్ల నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు.