News December 22, 2025

కేసీఆర్‌కు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్!

image

TG: ఇక ప్రభుత్వంపై ఉద్యమం చేస్తానంటూ బీఆర్ఎస్ చీఫ్ <<18633627>>KCR<<>> ప్రకటనతో కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ నేతలు సిద్ధమయ్యారు. నిన్న సీఎం <<18634773>>రేవంత్<<>>, మంత్రి ఉత్తమ్ బదులివ్వగా ఇవాళ మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా 8 నెలల విరామం తర్వాత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.

Similar News

News December 22, 2025

మీకు తెలుసా?.. ఆ ఊరిలో ఒక్కరే ఉంటారు!

image

ఒక ఊరికి ఒక్కరే రాజు, ఒక్కరే బంటు అంటే వినడానికి వింతగా ఉన్నా.. అమెరికాలోని ‘మోనోవి’లో ఇదే జరుగుతోంది. 89 ఏళ్ల ఎల్సీ ఐలర్ ఆ ఊరిలో ఏకైక నివాసి. ఏటా తనకు తానే ఓటు వేసుకుని మేయర్‌గా గెలుస్తారు. సెక్రటరీగా సంతకాలు చేస్తూ, తన హోటల్ కోసం తానే లైసెన్సులు ఇచ్చుకుంటారు. ఊరి మనుగడ కోసం పన్నులు చెల్లిస్తుంటారు. భర్త జ్ఞాపకార్థం ఒక లైబ్రరీ, ఒక హోటల్ నడుపుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.

News December 22, 2025

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో టెక్నీషియన్ పోస్టులు

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<>HAL)<<>>నాసిక్‌లో 18 ఎక్స్ సర్వీస్‌మెన్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఇంటర్ అర్హత కలిగి ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో పని చేసిన వారు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in

News December 22, 2025

Credit Card Scam: లిమిట్ పెంచుతామంటూ..

image

‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అన్న చందంగా మారింది సైబర్ మోసగాళ్ల పని. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఈ మధ్య కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. కాల్స్, SMS, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. బ్యాంకు నుంచి లేదా క్రెడిట్ కార్డు సంస్థలకు చెందిన వాళ్లమని నమ్మబలుకుతారు. OTP, CVV వంటి కీలక సమాచారాన్ని లాగుతారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు పేరిట లింక్ పంపి బురిడీ కొట్టిస్తారు.