News January 29, 2026
కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనని మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. ఆయనకు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తదుపరి విచారణ తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్ మరోసారి నోటీసులు ఇస్తుందా? ఎప్పుడు, ఎక్కడ విచారిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. తనను ఎర్రవల్లిలోనే <<18996095>>ప్రశ్నించాలని<<>> కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.
Similar News
News February 21, 2026
మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి: సీతక్క

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క కోరారు. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా జాతరకు విశేష గుర్తింపు లభించేలా విస్తృత ప్రచారం కల్పించిన ట్రస్ట్‌ను అభినందించారు. కాగా జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మందికి పైగా హాజరయ్యారు.
News February 21, 2026
నేరేడుకు నీరు, పోషకాలు ముఖ్యం

నేరేడు తోటల్లో అధిక దిగుబడి రావాలంటే చెట్లకు తగిన పోషకాలను, నీటిని కూడా అందించాలి. అందుకే పంట పూత నుంచి పిందెలు, కాయలు ఏర్పడే దశలో నిపుణుల సూచనలతో తగిన మోతాదులో ఒకసారి యూరియా, పొటాష్ అందిస్తే అవి పండ్ల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే డ్రిప్ పద్ధతిలో తోటలకు నీరు అందిస్తుంటే.. ఎరువులను కూడా ఫర్టిగేషన్ పద్ధతిలో ఇవ్వాలి. దీని వల్ల మంచి నాణ్యతతో కూడిన దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది.
News February 21, 2026
పరీక్షల వేళ ఇలా ప్రిపేర్ అవ్వండి!

పరీక్షల సమయం వచ్చేసింది. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదవడం ముఖ్యం. కొత్త విషయాల కంటే చదివిన వాటిని పదేపదే రివిజన్ చేయడం వల్ల గుర్తుంచుకోవడం సులభమవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం గత ఏడాది ప్రశ్నపత్రాలను చెక్ చేసి ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా రిపీటయ్యే ప్రశ్నలపై దృష్టి సారించండి. ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధమై ఉత్తమ ఫలితాలను సాధించండి. ALL THE BEST


