News April 1, 2025

కేసీఆర్‌తో వరంగల్ బీఆర్ఎస్ నేతల భేటీ

image

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వారంతా కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సభా నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. పార్టీ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేస్తామని వారంతా ముక్తకంఠంతో పార్టీ అధినేతకు హామీ ఇచ్చారు.

Similar News

News July 10, 2025

26వ తేదీ లోగా డిగ్రీ కోర్సుల మేకప్ ప్రాక్టికల్ పరీక్షలు

image

ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మేకప్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 26 లోపు నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్ ఇన్‌స్టెంట్/ మేకప్ ప్రాక్టికల్, ప్రాజెక్ట్, వైవా పరీక్షలను నిర్వహించి 26వ తేదీల్లోగా మార్కుల మెమోలను వెబ్‌సైట్లో అప్లోడ్ చేస్తామన్నారు.

News July 10, 2025

GHMCలో మీడియాపై ఆంక్షలు?

image

GHMC కార్యాలయాల్లోకి మీడియా ఎంట్రీని వారానికి ఒక్కరోజే అనుమతించాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించినట్లు తెలుస్తోంది. ముందు పూర్తిగా నిషేధించాలని భావించినా, చర్చల అనంతరం ఒక్కరోజుకు వెసులుబాటు కల్పించింది. దీంతో GHMC, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోకి మీడియాకు వారానికి ఒక్కరోజే అనుమతి ఉండనుంది. తమ విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకే దీనికి కారణంగా తెలుస్తోండగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News July 10, 2025

నిజాంపేట్‌లో మరో కల్తీ కల్లు కేసు.. గాంధీకి తరలింపు

image

కల్తీ కల్లు తాగి నిజాంపేట్‌లోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న <<17017648>>వి.సుగుణమ్మ(58)<<>>ను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమెకు కూడా ఆ కళ్లు తాగడంతోనే వాంతులు విరోచనాలు కాగా కుటుంబ సభ్యులు నిజాంపేట్‌లోని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యచికిత్సల కోసం నేడు 108 సిబ్బంది సతీశ్ శ్రీనివాస్, సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.