News April 5, 2025
కేసీఆర్‌తో సమావేశమైన నల్గొండ బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ వేడుకలు విజయవంతం చేయడానికి జిల్లాలో చేస్తున్న కార్యక్రమాలను కేసీఆర్‌కు వివరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Similar News
News April 6, 2025
కాచుకొని ఉన్న ‘ఉపగ్రహ’ ముప్పు!

భూ కక్ష్యలో శకలాల ముప్పు నానాటికీ మరింత పెరుగుతోంది. ఉపగ్రహాలు తిరిగే వేగం కారణంగా ఒక సెం.మీ పరిమాణం ఉన్న వస్తువు ఢీకొట్టినా విధ్వంసం వేరేస్థాయిలో ఉంటుంది. భూ కక్ష్యలో అలాంటివి 12 లక్షలకు పైగా ఉన్నాయి. వీటి వల్ల ఒక ఉపగ్రహం ధ్వంసమైనా అది మిగతా శాటిలైట్లన్నింటినీ ధ్వంసం చేయొచ్చు. అదే జరిగితే భూమిపై సాంకేతికత అంతా ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉందని పరిశోధకుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News April 6, 2025
అన్నమయ్య జిల్లాలో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

మైనర్ బాలికను మోసంచేసి పిల్లలు కలిగేలా చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు బీ కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ బాబు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామంలోని వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకుని గర్భం దాల్చేలా చేసినట్లు చెప్పారు. అనంతరం ఆమెను తీసుకెళ్లి కర్ణాటకలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడంతో అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
News April 6, 2025
టెక్కలి: ఇద్దరు ఆడపిల్లలతో అత్తింటి ముందు నిరసన

ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఓ వివాహిత శనివారం తన అత్త వారి ఇంటి ముందు నిరసన చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బుడ్డిపేటకి చెందిన మెట్ట గోపాలకృష్ణతో పోలవరం గ్రామానికి చెందిన రాణికి 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండేళ్లుగా రాణి తన కన్నవారింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో అత్తవారి ఇంటికి వెళ్లగా వారు లోనికి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.