News April 1, 2025
కేసీ వేణుగోపాల్‌ను కలిసిన ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేలు

ఢిల్లీలో ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేలంతా కలిసినట్లు సమాచారం. కలిసిన వారిలో ఎమ్మెల్యేలు టీ. రాంమోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య ఉన్నారు.
Similar News
News February 26, 2026
యువతకు రుణాల మంజూరు వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ములుగు జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్ మహేందర్ జీ పాల్గొన్నారు. బ్యాంకులు నిర్దేశించిన రుణ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. మహిళా సంఘాలు, వయోవృద్ధుల సంఘాలు, నిరుద్యోగ యువతకు రుణాల మంజూరు వేగవంతం చేయాలని కోరారు. 2026-27 ఆర్థిక సంవత్సర ప్రొజెక్షన్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ బుక్‌ను ఆవిష్కరించారు.
News February 26, 2026
తాళికట్టు శుభవేళ.. రష్మిక ఆనందబాష్పాలు

ఏ ఆడపిల్లకైనా వివాహమనేది జీవితంలో మధురమైన ఘట్టం. హీరోయిన్ రష్మిక మందన్న కూడా చిన్న కుటుంబం నుంచి నేషనల్ క్రష్ స్థాయికి చేరుకొని ఇప్పుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్నారు. జీవితాంతం తోడుంటానంటూ అగ్నిసాక్షిగా విజయ్ తన మెడలో తాళికట్టిన శుభవేళ రష్మిక కళ్లలో నీళ్లు తిరిగాయి. తన ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో వ్యక్తపరిచిన ఫొటో పైన చూడవచ్చు.
News February 26, 2026
భద్రాద్రి: ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగినట్లు DIEO వెంకటేశ్వర్లు తెలిపారు. సాధారణ విభాగంలో 6,743, వృత్తి విద్యా విభాగంలో 1,895తో కలిపి మొత్తం 8,638 మంది విద్యార్థులలో సాధారణ విభాగంలో 6,622 మంది, వృత్తి విద్యా విభాగంలో 1,822 మంది కలిపి మొత్తం 8,444 మంది విద్యార్థుల హాజరు అయ్యారని తెలిపారు.194 మంది విద్యార్థులు గైర్హాజరయ్యాని పేర్కొన్నారు.


