News August 23, 2025
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

జాతీయ లోక్ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్ బాబు సూచించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు వచ్చే నెల 13న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్‌తో నిర్వహించడం జరుగుతుందన్నారు. కాగా జిల్లా పరిధిలోని కేసుల పరిష్కారానికి పోలీసులకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలను అందజేశారు.
Similar News
News August 23, 2025
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: ఎస్పీ

జిల్లాలోని ఆయా పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పలు పాఠశాలల యాజమాన్యాలతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే విద్యార్థులు ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడితే చట్టం తీసుకునే చర్యల గురించి యాజమాన్యాలు వివరించాలన్నారు.
News August 23, 2025
ఆన్‌లైన్‌లో గంజాయి రోలింగ్ కవర్స్.. నెట్టింట ఫిర్యాదు

TG: క్యూ- కామర్స్ సైట్లలో గంజాయి రోలింగ్ పేపర్లు అందుబాటులో ఉండటంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. వీటి అమ్మకంపై ఓ నెటిజన్ ‘X’ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మాదకద్రవ్యాలను అరికట్టేందుకు మీరు సీరియస్‌గా పనిచేస్తున్నట్లయితే గత 48 గంటల్లో రోలింగ్ పేపర్లు కొన్నవారి వివరాలు తీసుకోండి. వారికి డ్రగ్స్ టెస్టులు చేయండి’ అని కోరారు.
News August 23, 2025
మేడ్చల్: బస్తీ దవాఖానాల్లో ఉద్యోగాలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బస్తీ దవాఖానాల్లో 6 సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉంటాయి. దరఖాస్తుదారులు జిల్లాకు చెందిన వారై, ఎస్ఎస్‌సీ పాసై ఉండాలి. అర్హత గల అభ్యర్థులు ఈనెల 25, 26, 28వ తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు జిల్లా వెబ్‌సైట్‌ను సందర్శించండి.