News December 19, 2025
కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గం: సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కక్షిదారులు ఈ నెల 21న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ సన్‌ప్రీత్ సింగ్ కోరారు. క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, కుటుంబ తగాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇరు వర్గాల సమ్మతితో కేసులను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News December 19, 2025
RJY: విద్యార్థునులతో నారా లోకేశ్ సెల్ఫీ

మంత్రి లోకేశ్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి సిటీలోకి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద స్వాగతం పలికారు. పార్టీ జెండాలు, డప్పులు, బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రతిభ కళాశాల విద్యార్థులతో నారా లోకేశ్ సెల్ఫీ దిగారు.
News December 19, 2025
ప్రపంచంలో టాప్ రిచ్ ఫ్యామిలీస్ ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబాల జాబితాను బ్లూమ్‌బర్గ్ రిలీజ్ చేసింది. టాప్ 25 రిచ్ ఫ్యామిలీస్ సంపద $2.9 ట్రిలియన్లకు చేరుకుందని తెలిపింది. టాప్ 10 ఫ్యామిలీస్..
*వాల్టన్ (US)-$513.4B *అల్ నహ్యాన్(UAE)-$335.9B
*అల్ సౌద్ (సౌదీ)-$213.6B *అల్ థానీ(ఖతర్)-$199.5B
*హీర్మేస్(ఫ్రాన్స్)-$184.5B *కోచ్(US)-$150.5B
*మార్స్(US)-143.4B *అంబానీ(భారత్)-$105.6B
*వెర్థీమర్(ఫ్రాన్స్)-$85.6B *థామ్సన్(కెనడా)-$82.1B
News December 19, 2025
NZB: 20న కలెక్టరేట్‌లో ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమం: కలెక్టర్

వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన 3 నెలల ప్రత్యేక కార్యక్రమం ‘ మీ డబ్బు- మీ హక్కు’ లో భాగంగా ఈ నెల 20న కలెక్టరేట్ లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. క్లెయిమ్ చేసుకోని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు.


