News March 21, 2025

కైకలూరు: అత్త చేతి వేళ్లను రక్తం వచ్చేలా కరిచిన అల్లుడు

image

పిల్లనిచ్చిన అత్త చేతి వేళ్లను అల్లుడు రక్తం వచ్చేలా కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై ఎస్ఐ వెంకటేశ్వరరావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. జంగం తిరుపతమ్మ (45) మార్చి 19న అల్లుడు బందెల జోజి బాబు ఇంటికి వెళ్ళారు. తన కూతురిని ఇంటికి పంపించాలని అల్లుడిని అత్త కోరగా, కోపంతో ఊగిపోయిన అల్లుడు అత్త చేతి వేళ్లను కొరికి గాయపరిచాడు. ఘటనపై ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Similar News

News March 28, 2025

పలిమెల: అగ్నివీర్‌ ఎంపికైన రాకేశ్ 

image

పలిమెల మండలం పంకెనకు చెందిన బొచ్చు లక్ష్మయ్య- పుష్పలతల కుమారుడు రాకేశ్ ఇటీవల ప్రకటించిన అగ్ని వీర్ ఆర్మీ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి, మెరిట్ లిస్టులో ఆర్మీ జనరల్ డ్యూటీ క్యాటగిరిలో ఎంపికయ్యాడు. రాకేశ్ మాట్లాడుతూ.. తప తల్లిదండ్రులు నిరంతరం కష్టపడుతూ తనను చదివించారని, వారి కృషి వల్లనే ఉద్యోగం సాధించానని తెలిపాడు. 

News March 28, 2025

అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లం మార్కెట్‌ను సందర్శించిన కలెక్టర్

image

అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ యార్డ్ లో సమస్యలను కలెక్టర్‌కు ఎమ్మెల్యే వివరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతు బజార్ ఏర్పాటు చేసి మార్కెట్ యార్డుకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. బెల్లం తయారు చేసే విధానాన్ని రైతులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.

News March 28, 2025

మామిడికుదురు: పాము కాటుకు గురై యువతి మృతి

image

మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన కంచి శృతి (24) పాము కాటుకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఉదయం 6.గంటల సమయంలో ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా చేతిపై పాము కాటు వేయడంతో స్థానికులు వెంటనే రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

error: Content is protected !!