News March 31, 2024
కైకలూరు: నాటు తుపాకీ కలిగిన ఇద్దరి అరెస్టు

ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కైకలూరు మండలం రామవరం గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల వద్ద 2 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి ఎటువంటి లైసెన్స్ లేదని పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రూరల్ ఎస్ఐ రామకృష్ణ అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 28, 2025
రైతులను ప్రోత్సహించండి: కలెక్టర్

జిల్లాలో అధికంగా వినియోగించే సన్న రకాల వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో పండించాల్సిన వరి పంటలపై పలు సూచనలు చేశారు. సన్న రకం వరి వంగడాల సాగుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.
News March 27, 2025
కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

☞ బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లెనిద్ర చేసిన ఎస్పీ
☞ గుడ్లవల్లేరులో విద్యార్థినితో అనుచిత ప్రవర్తన.. టీచర్ సస్పెండ్
☞MTM: హత్య కేసును ఛేదించిన పోలీసులు
☞మోపిదేవిలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు
☞మచిలీపట్నంలో మాజీ కౌన్సిలర్ మృతి
☞మోపిదేవిలో వివాదం.. కత్తితో దాడి
☞గుడివాడ: ఫోన్లో కొడాలి నానిని పరామర్శించిన జగన్
News March 27, 2025
గుడివాడ: కొడాలి నానికి గుండె సమస్యలు ఉన్నాయి.!

మాజీ మంత్రి కొడాలి నానికి గుండె సమస్యలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజులుగా వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు 3 వాల్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వైసీపీ నేత దుక్కిపాటి శశి భూషణ్ తెలియజేశారు.