News April 14, 2025

కైకలూరు: బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో తప్పిన ప్రమాదం

image

కైకలూరు స్టేషన్ నుంచి వెళుతున్న తిరుపతి- బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల ఏసీ కోచ్ మీద పెద్ద చెట్టు విరిగిపడింది. ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్క్యూ ట్రైన్ సిబ్బంది చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

Similar News

News September 17, 2025

KMR: మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే..

image

మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జరిమానాలు, జైలు శిక్షలు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో మొత్తం 21 మందిపై కేసులు నమోదు చేశారు. వీరికి కోర్టు మంగళవారం రూ.21,000 జరిమానా విధించింది. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తికి కోర్టు 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. ‘మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News September 17, 2025

కొత్తగూడెం: హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

image

ఓ హత్య కేసులో నిందితుడైన పల్లం సాయికుమార్‌కు పదేళ్ల జైలు, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి పాటిల్ వసంత్ తీర్పు చెప్పారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్‌కు చెందిన బడికల సంతోష్‌ను సాయికుమార్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి హత్య చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోర్టుకు ఆధారాలు సమర్పించగా, నేరం రుజువైనట్టు తేలింది. కేసు ఛేదించిన పోలీసులను SP అభినందించారు.

News September 17, 2025

మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: పవన్

image

AP: సమాజంలో వైషమ్యాలు సృష్టించే శక్తులు పేట్రేగిపోతున్నాయని కలెక్టర్లు, SPల సదస్సులో Dy.CM పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘సామాజిక వర్గాల మధ్య అంతరాలు సృష్టించే విద్రోహ శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత అవసరం. CM చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వండి. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. డ్రగ్స్ వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి’ అని ఆదేశించారు.