News April 13, 2025
కైలాపట్నం: మృతదేహాలతో నిండిన పేలుడు ప్రాంతం

కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో మందు గుండు సామాగ్రి తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన భారీ పేలుడు వలన మృతదేహాలు పడి ఉన్నాయి. వెతికే కొద్దీ మృతదేహాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ హృదయ విచార ఘటన స్థానికులను, చుట్టుపక్కల ప్రాంతాల వారిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక కుటుంబ సభ్యుల బాధకు అంతులేకుండా పోయింది. సంబంధిత అధికారులు వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News November 1, 2025
అక్షతలు తలపైన వేసుకుంటే…

శాస్త్రం ప్రకారం.. అక్షతలు శుభాన్ని సూచిస్తాయి. అందుకే శుభ కార్యాల్లో, పండుగలప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అక్షతలను ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోవాలని పెద్దలు సూచిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. పూజలో వాడిన అక్షతలను దాచుకుని, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు వాటిని తలపైన వేసుకోవాలట. ఇలా చేస్తే చేయాలనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం.
News November 1, 2025
ఓల్డ్ గూగుల్ క్రోమ్ వాడుతున్నారా?

ఓల్డ్ వెర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని CERT-In హెచ్చరికలు జారీ చేసింది. పాత వెర్షన్లలో తీవ్రమైన భద్రతా లోపాలున్నాయని, దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదముందని తెలిపింది. లైనక్స్, విండోస్, macOSలో 142.0.7444.59/60 కంటే ముందున్న వెర్షన్లు వాడుతుంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
News November 1, 2025
ఆసిఫాబాద్: విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ASF జిల్లా కలెక్టరేట్‌లో విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.


