News December 16, 2024

కైలాసగిరిలో స్కై సైక్లింగ్ జిప్‌లైనర్

image

ఏపీలో పర్యటక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. సందర్శకుల కోసం కైలాసగిరిలో స్కై సైక్లింగ్ జిప్‌లైనర్ ఇటీవల ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి రూ.300గా టిక్కెట్ ధరను నిర్ణయించారు. జల విన్యాసాలపై అసక్తి ఉన్నవారి కోసం రుషికొండ బీచ్‌లో మళ్లీ స్కూబా డైవింగ్ అందుబాటులోకి వచ్చింది. ఆకాశంలో విహరించేందుకు పారా గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తెచ్చారు.

Similar News

News November 11, 2025

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7రోజుల జైలు శిక్ష: SP

image

జామి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి స్కూటీ నడిపిన కొట్టాం గ్రామానికి చెందిన నక్కెళ్ల ఎర్రినాయుడుకు కోర్టు 7రోజులు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 9న విసినిగిరి జంక్షన్ వద్ద వాహన తనిఖీల సమయంలో మద్యం తాగి స్కూటీ నడిపిన నిందితుడిని జామి పోలీసులు పట్టుకున్నారు. సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచిన తరువాత శిక్ష ఖరారైందన్నారు.

News November 11, 2025

సీఎం స్ఫూర్తితోనే ముందుకు వచ్చాను: రామ్మోహన్‌రావు

image

నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి పెట్టుబడిదారుడిగా ఎదిగానని పారిశ్రామికవేత్త రామ్మోహన్‌రావు తెలిపారు. బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన CMతో వర్చువల్‌గా మాట్లాడారు. 2017 CIIసదస్సులో CM సమక్షంలో MOU కుదిరిందని, అప్పటి నుంచి చంద్రబాబు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 5 వేల మంది రైతులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.

News November 11, 2025

పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలి: సీఎం చంద్రబాబు

image

వంగర మండలంలోని అరసాడలో రూ.102 కోట్లతో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్‌గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పెట్టుబడులకు ఆకర్షితులు కాకుండా పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు. యువ పారిశ్రామికవేత్తలు మట్టిలో మాణిక్యాలు అని, ప్రభుత్వ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు.