News April 13, 2025

కైలాసపట్నంలో మృతి చెందిన వారి వివరాలు ఇవే

image

అనకాపల్లి జిల్లా కైలాసపట్నం మందు గుండు తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన వారిలో అప్పికొండ తాతబాబు(50), సంగరాతి గోవిందు(45), దాడి రామలక్ష్మి(38), దేవర నిర్మల(38),పురం పాప(40),గుంపిన వేణుబాబు(40),సేనాపతి బాబురావు(56), మనోహర్ ఉన్నారు. మరికొద్ది సేపటిలో హోం మంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి రానున్నారు.

Similar News

News March 1, 2026

PGRSను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం వెల్లడించింది. ఉదయం10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.

News March 1, 2026

నెల్లూరు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఎస్పీ ఏమన్నారంటే.!

image

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్పీ అజిత వాజెండ్ల తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారని చెప్పారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.

News March 1, 2026

GST వసూళ్లలో తెలంగాణ దూకుడు

image

TG: GST వసూళ్లలో రాష్ట్రం భారీ వృద్ధిని నమోదు చేసింది. 2026 FEBలో ₹4,125 CR GST వసూలు అయింది. 2025 FEB కన్నా ఇది 14% ఎక్కువ. ఈ ఏడాది చివరి త్రైమాసికం కనుక పన్ను వసూళ్లు ఇంకా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. చిన్న, మధ్య స్థాయి వ్యాపారులు GST చెల్లింపులకు సంబంధించిన పన్ను బకాయిలను ఫిబ్రవరి, మార్చిలో క్లియర్ చేస్తుంటారు. చివరి నెల MARలో ఈ వసూళ్లు మరింత ఎక్కువ ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.