News January 2, 2026
కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రాక.. అభివృద్ధికి బాట!

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఆంజనేయ స్వామి వెలసిన కొండపై నిద్రిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవనే నమ్మకంతో వచ్చే భక్తులకు, కొండపైకి చేరుకోగానే సరైన గదులు లేక ఆలయ పరిసరాల్లో నేలపై నిద్రిస్తూ అవస్థలు పడ్డారు. భక్తుల మొర ఆలకించిన పవన్ 96 గదుల సత్ర నిర్మాణానికి శనివారం భూమి పూజ చేయనున్నారు. దీంతో భక్తుల కష్టాలు తీరనున్నాయి.
Similar News
News January 9, 2026
జాతీయస్థాయికి ఎంపికైన జనగాం కేజీబీవీ విద్యార్థిని

జనగాం జిల్లా కేజీబీవీ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జి.అక్షిత రూపొందించిన అడ్జస్టబుల్ బైక్ స్టాండ్ అనే వినూత్న ఆవిష్కరణకు గాను జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ (NLEPC) కు ఎంపికైంది. ఈ సందర్భంగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్‌తో పాటు ఉపాధ్యాయ బృందం అక్షితను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 9, 2026
BJP కొత్త ఆయుధంగా సెన్సార్ బోర్డు: స్టాలిన్

సెన్సార్ బోర్డుపై తమిళనాడు CM స్టాలిన్ ఫైర్ అయ్యారు. CBI, ED, IT శాఖ మాదిరే ఇప్పుడు సెన్సార్ బోర్డు BJP కొత్త ఆయుధంగా మారిందని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ విషయంలోనే ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. మొత్తం 25కట్స్ సూచిస్తూ U/A సర్టిఫికెట్‌ను CBFC జారీ చేసింది. 1965 యాంటీ హిందీ ఆందోళన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి DMK సపోర్ట్ ఉంది.
News January 9, 2026
KNR: ‘స్కూల్ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం’

KNRరూరల్(M) దుర్శేడ్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో కిసాన్ నగర్‌కు చెందిన బొడ్డు శశికుమార్(28) అక్కడికక్కడే మృతిచెందినట్లు రూరల్ CI నిరంజన్ రెడ్డి తెలిపారు. అతివేగంగా వచ్చిన <<18811180>>ఓ<<>> స్కూల్ బస్సు, శశికుమార్ ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టి తలపైనుంచి వెళ్లడంతో ఈ ఘోరం జరిగిందని పేర్కొన్నారు. నిందితుడైన డ్రైవర్ అనిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


