News February 6, 2025

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మహా మండపంలో వేదోచ్చరణతో స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు

Similar News

News February 6, 2025

కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీలు కూడా వేణును కలిశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ పనితీరు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం.

News February 6, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@జగిత్యాల మాత శిశు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ @కలెక్టరేట్ లో పౌరసరఫరాల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం @వెల్గటూరులో విద్యార్థినిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమం @ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం @జగిత్యాలలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆకస్మి తనిఖీలు @కోరుట్లలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం @కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు

News February 6, 2025

ఎమ్మెల్సీ కవితను కలిసిన జడ్పీ మాజీ చైర్పర్సన్, మాజీ సర్పంచులు

image

జగిత్యాల జిల్లాకు చెందిన జెడ్పి మాజీ చైర్పర్సన్ దావ వసంత, పలువురు మాజీ సర్పంచులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను గురువారం కలిశారు. సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పించేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలని, రైతు భరోసా నిధులు ఏకకాలంలో రైతులందరికీ అందించాలని ఎమ్మెల్సీ కవితకు విన్నవించినట్లు మాజీ ప్రజాప్రతినిధులు తెలిపారు. బకాయిల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వారన్నారు.

error: Content is protected !!