News November 30, 2025

కొండగట్టు అగ్ని ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం

image

కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంపై రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన వెంటనే జగిత్యాల జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బొమ్మల దుకాణాలలో అగ్నిప్రమాదం జరిగి, ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, అర్ధరాత్రి జరగడం వల్ల ప్రాణాపాయం తప్పిందని కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

Similar News

News December 1, 2025

జగిత్యాల: ‘ఈ సంవత్సరం 83 కేసులు నమోదు’

image

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెడికల్ కాలేజీ వరకు నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ ప్రారంభించారు. ఎయిడ్స్‌కు నివారణే మేలని, యువత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో 2,573 మంది ఏఆర్‌టి చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 83 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.

News December 1, 2025

మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

image

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్‌ను ఎస్పీ అభినందించారు.

News December 1, 2025

క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

image

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.