News January 25, 2025
కొండగట్టు అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ప్రసాద్

కొండగట్టు అదనపు ఈవోగా కృష్ణ ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 18న ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంతరావు సెలవులో ఉండడం వలన, హైదరాబాద్ దేవాదాయశాఖలో డీసీఎస్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణప్రసాద్‌కు కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నూతన ఈవోకు ఆలయ అధికారులు అర్చకులు శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈనెల 30న హుండీ లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నట్లు ఈవో తెలిపారు.
Similar News
News November 7, 2025
గోదావరిఖని: త్వరలో 473 మందికి కారుణ్య ఉత్తర్వులు

సింగరేణిలో మెడికల్ పూర్తి చేసి ఇప్పటి వరకు కారుణ్య నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది అభ్యర్థులకు ఈనెల 12న కొత్తగూడెం వేదికగా నియామక పత్రాలు అందజేస్తామని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చేతుల మీదుగా అందజేస్తారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వంపై తాము తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఇది జరుగనుందని తెలిపారు.
News November 7, 2025
బాల్య వివాహాలను నిషేధించడం ప్రతి ఒక్కరి బాధ్యత: పెద్దపల్లి కలెక్టర్

బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో “బేటి బచావో బేటి పడావో” కార్యక్రమంలో బాల్య వివాహాల నిరోధన పోస్టర్‌ను ఆవిష్కరించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధం, వయసు 18 కంటే తక్కువ ఉన్న అమ్మాయిలకు మానసిక, శారీరక, ఆర్థిక నష్టాలు కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News November 7, 2025
రిజర్వ్ ఫారెస్ట్‌లో నగర వనం: డీఎఫ్‌వో

జాతీయ రహదారిని ఆనుకుని దివాన్ చెరువులోని రిజర్వ్ ఫారెస్ట్ లో 125 ఎకరాల విస్తీర్ణంలో రూ.రెండు కోట్లు వ్యయంతో నగరవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ గౌరీ శంకర్‌తో కలిసి ఫారెస్ట్ డీఎఫ్ఓ ప్రభాకరరావు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చే పుష్కరాలు నాటికి ఇది సిద్ధమవుతుందని డీఎఫ్ఓ తెలిపారు.


