News August 2, 2024
కొండగట్టు ఆలయ ఈవోగా రామకృష్ణారావు నియామకం
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా రామకృష్ణారావును నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఆలయ ఈవోగా అదనపు బాధ్యత నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌ను మెదక్ అసిస్టెంట్ కమిషనర్‌గా బదలీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై తనవంతు కృషి చేస్తానని, సదుపాయాలు మెరుగు పరుస్తానని రామకృష్ణారావు తెలిపారు.
Similar News
News November 27, 2024
సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎమ్మెల్యే
పెద్దపల్లిలో డిసెంబర్ 4న సీఎం పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు అనువైన ప్రదేశాలను MLA విజయ రమణారావు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి బుధవారం పరిశీలించారు. రంగంపల్లి-పెద్దకల్వల శివారులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సభ ఏర్పాట్లకు అనువుగా ఉంటుందని MLA తెలిపారు. సభా స్థలాన్ని శుభ్రం చేయాలని, గురువారం ఉదయం స్టేజ్ ఏర్పాటుకు HYD నుంచి ప్రత్యేక బృందం వస్తుందని చెప్పారు.
News November 27, 2024
ఉప్పల్ ఆర్వోబీ పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి ఈటల వినతి
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్‌ను ఈటల కలిసి వినతి పత్రం అందజేశారు. అదే విధంగా కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరారు.
News November 27, 2024
వానాకాలం పోయి యాసంగి వచ్చే.. రైతు భరోసా రాకపోయే: KTR
యాసంగి పోయి వానాకాలం వచ్చింది, వానాకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చింది కానీ రైతు భరోసా రాకపోయే అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన రైతు భరోసా మీద వేసిన మంత్రి వర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదన్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో? ఎప్పటి నుంచి ఇస్తారో? అసలు ఇస్తారో, ఇవ్వరో? ఇప్పటి వరకూ స్పష్టత లేదన్నారు.