News April 15, 2025

కొండగట్టు: చిన్న జయంతికి వచ్చిన ఆదాయం రూ.1,67,73,800

image

కొండగట్టు చిన్న జయంతికి వివిధ టికెట్ల ద్వారా దేవాలయానికి రూ.1,67,73,800 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. లడ్డు, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.97,16,800, దీక్ష విరమణల ద్వారా రూ.40,17,500, కేశఖండన ద్వారా రూ.11,78,000, శీఘ్ర దర్శనం ద్వారా రూ. 18,61,500 లభించినట్లు తెలిపారు. అలాగే చిన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొని సేవలందించిన ప్రతి ఒక్కరికి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

Similar News

News April 16, 2025

పరీక్షల షెడ్యూల్ విడుదల

image

పలు పోటీ పరీక్షల షెడ్యూల్‌ను APPSC విడుదల చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న(9.30 నుంచి 12 వరకు) పేపర్-1, 30న పేపర్-2(ఉ.9.30 నుంచి 12 వరకు), మ.2.30 నుంచి 5 వరకు పేపర్-3 పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 18న హాల్‌టికెట్లు రిలీజ్ అవుతాయి. అలాగే గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు APR 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.

News April 16, 2025

చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలించిన విశాఖ సీపీ 

image

సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం పర్యవేక్షించారు. గోశాల జంక్షన్ వద్ద పార్కింగ్, ఘాట్ రోడ్లో మలుపులు, క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో స్టాప్ బోర్డులను పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాలు తెలిసేలా సైన్ బోర్డులు పెట్టాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు విశాలంగా ఉండాలని సూచించారు.

News April 16, 2025

విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: CMD

image

హనుమకొండ NPDCL కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి 16 సర్కిళ్ల ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

error: Content is protected !!