News April 10, 2025
కొండగట్టు చిన్న హనుమాన్ జయంతికి పటిష్ఠ ఏర్పాట్లు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతికి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఆలయానికి సుమారు 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, 45 వేల మంది మాల విరమణ చేస్తారని తెలిపారు. 5 లక్షల ప్రసాదాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News April 18, 2025
చారిత్రక సంపదలో ‘షాందార్ హైదరాబాద్’

చారిత్రక సంపదకు పుట్టినిల్లు మన HYD. నగర నిర్మాణ చిహ్నానికి చార్మినార్, 12వ శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోట, రాజభవనాలకు కేరాఫ్‌గా చౌమహల్లా ప్యాలెస్, మాల్వాల ప్యాలెస్ ఉన్నాయి. కళా ప్రపంచంలో సాలార్‌జంగ్ మ్యూజియం ఓ మాస్టర్ పీస్. ట్యాంక్‌బండ్, కుతుబ్ షాహీ టూంబ్స్ మక్కా మసీద్, తారామతి బరాదారి, తోలి(డమ్రి) మసీద్, పైగా టూంబ్స్, స్పానీష్ మసీద్ నగర వారసత్వ సంపదకు ఆనవాళ్లు. నేడు World Heritage Day.
News April 18, 2025
IPL: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

పేలవ ఆటతీరుతో SRH నిరాశపరుస్తోంది. 7 మ్యాచులు ఆడి కేవలం రెండే గెలవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే మిగతా 7 మ్యాచుల్లో కచ్చితంగా 6 గెలవాలి. ఒకవేళ 5 గెలిస్తే నెట్ రన్‌రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. కానీ ప్రస్తుతం కమిన్స్ సేన NRR -1.217గా ఉంది. ఇది పాజిటివ్‌లోకి రావాలంటే భారీ తేడాలతో విజయాలు సాధించాల్సి ఉంటుంది. మరి SRH ప్లేఆఫ్స్‌కు వెళ్తుందా? కామెంట్ చేయండి.
News April 18, 2025
కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా అమర్నాథ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు కడప జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి ఆధ్వర్యంలో కార్యవర్గ నియామకాన్ని చేపట్టారు. బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డిని పార్టీ జిల్లా సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నియామక పత్రాన్ని అందజేశారు.