News April 12, 2025

కొండగట్టు: జయంతి ఉత్సవాల్లో మహిళా పోలీసులు

image

చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో భక్తుల సౌకర్యార్థం కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 800 మంది పోలీసుల పర్యవేక్షణలో ఉత్సవాలు సజావుగా సాగుతున్నాయి. మహిళా పోలీసులు ఉత్సాహంగా పాల్గొని బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్‌తో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కొండగట్టుకు తరలివస్తున్న హనుమాన్ దీక్షాపరులకు పోలీసులు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 6, 2025

జనగామ జిల్లాలో రేపు ‘వందే మాతరం’ సామూహిక గీతాలాపన

image

మహాకవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన “వందే మాతరం” గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సామూహిక గీతాలాపన చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News November 6, 2025

ఫర్నిచర్ శిక్షణ కోసం 19 మంది ఎంపిక

image

భద్రాద్రి కలెక్టరేట్లో NSTI, FFSC, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మల్టీపర్పస్ అసిస్టెంట్ ఫర్ ఫర్నిచర్ ప్రొడక్షన్ & ఇన్స్టాలేషన్ శిక్షణ కోసం డ్రాయింగ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఎంపికల కోసం ఆన్లైన్లో 69 మంది పేరు నమోదు చేసుకోగా మొత్తం 29 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల ఆధారంగా 19 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.

News November 6, 2025

పీఎం శ్రీ నిధులు సమర్థవంతంగా వినియోగించాలి: ఇన్చార్జ్ కలెక్టర్

image

పీఎం శ్రీ నిధులను అధికారులు సమర్థవంతంగా వినియోగించాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిధుల వినియోగంపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపికైన 28 పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, క్రీడా అభివృద్ధి, యూత్ ఎకో క్లబ్ ఏర్పాటు, పరిశ్రమల విజిట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.