News April 12, 2025

కొండగట్టు: జయంతి రోజు ప్రత్యేక అలంకారణలో అంజన్న

image

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఇవాళ చిన్న జయంతి పురస్కరించుకొని ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ముందుగా వివిధ అభిషేకాలు నిర్వహించి, తర్వాత పూలు పండ్లతో అలంకరించి పూజలు చేశారు. చిన్న జయంతి సందర్భంగా లక్షలాదిగా దీక్షా పరులు, సామాన్య భక్తులు కొండగట్టు తరలివస్తున్నారు. అంజన్న దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

Similar News

News February 27, 2026

KK లైన్ కోల్పోయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్

image

APకి కీలకమైన కొత్తవలస-కిరండోల్ (KK లైన్) మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి రాయగడ డివిజన్‌లోకి వెళ్లింది. వాల్తేరు డివిజన్‌లో KK లైన్లోని అరకు, బొర్ర గుహాలు,ఐరన్ ఓర్,బొగ్గు వంటి భారీ కార్గో రవాణాతో జోన్‌కు భారీ ఆదాయం వచ్చేది. కొత్తవలస జంక్షన్‌తో పాటు VZM, SKLM జిల్లాల్లోని కీలక సెక్షన్లు రాయగడ డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కు వెళ్లాయి. ఈ జోన్ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడనుంది.

News February 27, 2026

UPSC అభ్యర్థులకు ట్యాబ్‌ల అందజేత

image

యూపీఎస్సీ(UPSC) పరీక్షల్లో ఉచిత శిక్షణకు ఎంపికైన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ హిమాన్సు శుక్లా అధ్యాయన సామాగ్రితో కూడిన డిజిటల్ ట్యాబ్‌లను అందజేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీటిని అభ్యర్థులకు అందజేశారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.

News February 27, 2026

సునీల్ నాయక్ ఘటన.. బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం

image

బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్యాడర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల IPS సునీల్ నాయక్ ఘటనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే <<19220184>>పట్నా కోర్టు<<>> IG స్థాయి అధికారిపై AP పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్/కేస్ డైరీ వెంట లేకుండా సునీల్‌ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది.