News January 3, 2026

కొండగట్టు: పవన్‌తో పాల్గొననున్న ప్రముఖులు వీరే..!

image

కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఏపీ శాసనమండలి విప్ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, టీటీడీ బోర్డు మెంబర్లు ఆనందసాయి, మహేందర్, టీటీడీ ఎల్ఏసి చైర్మన్ శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శివశ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఆదిరెడ్డి పాల్గొననున్నారు.

Similar News

News February 14, 2026

IND vs PAK: వర్షం అడ్డంకి లేదు.. ఫుల్ గేమ్ గ్యారంటీ?

image

రేపు కొలంబోలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణుల అంచనా. IND vs PAK మ్యాచ్ ప్రారంభమయ్యే టైమ్‌(7PM)కు స్కై క్లియర్‌గా ఉంటుందని అంటున్నారు. ఆట సమయంలో వర్షం పడే ఛాన్స్ తక్కువగా ఉందన్నారు. అదే జరిగితే ఓవర్ల తగ్గింపు లేకుండా పూర్తి మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం వర్షం వల్ల అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్నా రాత్రికల్లా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది.

News February 14, 2026

భూపాలపల్లి: 26 ఏళ్లకే కౌన్సిలర్‌గా మేఘన

image

భూపాలపల్లి మున్సిపాలిటీ 25వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పొనగంటి మేఘన (26) ఘన విజయం సాధించారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆమె 664 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థిని ఓడించి సంచలనం సృష్టించారు. 2020లో ఇదే వార్డులో ఆమె భర్త శ్రీనివాస్ కేవలం 72 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ చేదు జ్ఞాపకానికి ఈసారి ప్రజా తీర్పుతో మధుర ముగింపు లభించింది. కుటుంబానికి ఎదురైన స్వల్ప ఓటమిని, మేఘన ఘన విజయంగా మలిచారు.

News February 14, 2026

పనసలో కాయకుళ్లును ఎలా నివారించాలి?

image

పనసలో కాయకుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజం 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున కలిపి పిందె సమయంలో పిచికారీ చేయాలి. మళ్లీ కాయ పెరుగుదల సమయంలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చెట్టు చుట్టూ రాలిన ఆకులు, కుళ్లిన భాగాలను తొలగించి శుభ్రంగా ఉంచాలి. చెట్టుకు సరైన గాలి ప్రసరణ ఉండేలా కొమ్మలను కత్తిరించాలి. సరైన పోషకాలు, నీటి యాజమాన్యం పాటించాలి.