News January 2, 2026
కొండగట్టు: పవన్ కళ్యాణ్ రాక.. భారీ బందోబస్తు ఏర్పాటు

కొండగట్టులో ప్రతి పౌర్ణమికి నిర్వహించే గిరిప్రదక్షిణ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక రెండు ఒకే రోజు కావడంతో రేపు కొండగట్టు భక్తులు, అభిమానులతో కిటకిటలాడనుంది. ప్రతి గిరిప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. అయితే అదే రోజు టీటీడీచే నిర్మిస్తున్న వసతి గదుల శంకుస్థాపనకు పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో దాదాపు 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News February 24, 2026
NZB: అరైవ్ అలైవ్ వారోత్సవాలు.. విద్యార్థులకు అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణలో ముందస్తు అవగాహనే అత్యంత కీలకమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. అలైవ్ అరైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు అంబాసిడర్‌గా ఉండి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News February 24, 2026
శ్రీకాకుళంలో డయేరియా కలకలం

AP: రాజమండ్రి <<19216426>>కల్తీ<<>> పాల ఘటన మరువక ముందే శ్రీకాకుళంలో భారీగా డయేరియా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ఈరోజు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న ఒక్కరోజే 25 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 76కు చేరింది. బాధితులు జీజీహెచ్, కిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని <<19224272>>సీఎం<<>> ఇప్పటికే అధికారులకు సూచించారు.
News February 24, 2026
నస్పూర్: వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

మంచిర్యాల జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.


