News October 30, 2025

కొండపర్తిలో విషాదం.. గోడ కూలి నిద్రలోనే మహిళ మృతి

image

HNK జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలోని ఎస్సీ కాలనీలో దుర్ఘటన చోటుచేసుకుంది. గద్దల సూరమ్మ(60) అనే మహిళ ఇంటి గోడ కూలిపోవడంతో మంచంలో నిద్రిస్తుండగానే మట్టి కుప్పల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందింది. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి రాకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 30, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. వేడి చేసిన నీటినే తాగండి

image

తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో వర్షాలు, వరద ప్రభావిత ప్రాంత ప్రజలు వేడి చేసిన నీటినే తాగాలని అధికారులు సూచించారు. తద్వారా వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ సమయంలో జ్వరం బారిన పడితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మరోవైపు కొన్ని చోట్ల అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.

News October 30, 2025

హీరో నారా రోహిత్ భార్య పల్నాడు వారే.!

image

హీరో నారా రోహిత్ వివాహానికి సీఎం చంద్రబాబు గురువారం హాజరుకానున్నారు. నారా రోహిత్ భార్య శిరీష లెల్ల పల్నాడు జిల్లాలోని రెంటచింతల గ్రామానికి చెందినవారు. ఆమెది ఒక సాధారణ రైతు కుటుంబం. సినిమా రంగంపై ఆసక్తితో ఆమె హైదరాబాద్‌కు వచ్చి, ఆడిషన్స్‌లో పాల్గొని, ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. వీరిద్దరూ పరస్పరం ఇష్టపడడంతో శిరీషను అదృష్టం వరించింది.

News October 30, 2025

న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ ప్రారంభించండి: ట్రంప్

image

US తక్షణమే న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ ప్రారంభిస్తుందని ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. తాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇతర అణుశక్తి దేశాల చర్యలకు సమాధానంగా తామీ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ‘న్యూక్లియర్ వెపన్స్‌లో అగ్రస్థానంలో అమెరికా ఉంది. తర్వాత రష్యా, చైనా ఉన్నాయి. కానీ ఐదేళ్లలో పరిస్థితి మారొచ్చు. నాకిది ఇష్టం లేకపోయినా తప్పట్లేదు’ అని తెలిపారు.