News February 6, 2025
కొండపాక: సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

కొండపాక మండలంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని బియ్యం, నిత్యావసర వస్తువులు, వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు సూచించారు.
Similar News
News February 24, 2026
అనంతపురంలో KG టమాటా ఎంతంటే?

★ అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టామాటా గరిష్ఠంగా రూ.10 పలుకుతోంది. కనిష్ఠంగా రూ.4, సరాసరి రూ.6తో సోమవారం విక్రయాలు సాగాయి.
★ మార్కెట్ యార్డులో టన్ను చీనీ రూ.25 వేలు, కనిష్ఠంగా రూ.8వేలు పలికింది.
News February 24, 2026
నేడు తిరుపతి పుట్టినరోజు..♥

టెంపుల్ సిటీగా ప్రసిద్ధి చెందిన తిరుపతి నేడు 896వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనుంది. చారిత్రక ఆధారాల ప్రకారం 1130 ఫిబ్రవరి 24న శ్రీరామానుజాచార్యులు శ్రీగోవిందరాజ స్వామి ఆలయ ప్రతిష్ఠ చేయడంతో నగరానికి శంకుస్థాపన జరిగినట్లు శాసనాలు సూచిస్తున్నాయి. అప్పుడే తిరుప్పడి తిరుపతిగా మారింది. 1130లో స్థాపితమైన తిరుపతి నగరానికి 2026 నాటికి 896 సంవత్సరాలు పూర్తయ్యాయి.
News February 24, 2026
పోలవరం: పెద్దపులి సంచారం

ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇటీవల పెద్దపులి అలజడి సృష్టించడం, అటవీ అధికారులు పులిని బంధించి విశాఖ జూకు తరలించి, తదనంతరం పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టడం తెలిసిందే. అయితే పులిని విడిచిపెట్టి వారం గడవకు ముందే రంప ఏజెన్సీలో జనవాసంలో పులి అలజడి మొదలైంది. సోమవారం పెదగెద్దాడ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.


