News April 6, 2025
కొండపి: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడు

ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో 52 సంవత్సరాల వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బాలిక తల్లిదండ్రులు కొండేపి పోలీసులను ఆశ్రయించారు. కొండపి మండలం ఉప్పలపాడులో పనుల కోసం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ఇంటి వద్ద వదిలి పనులకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉంటున్న సాదు వెంకట కోటయ్య బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రైవేటు భాగాలను తాకుతూ ఉండటంతో పోలీసులు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News April 7, 2025
ప్రకాశం: పండుగ రోజు విషాదం

ప్రకాశం జిల్లాలో శ్రీరామనవమి రోజున విషాదం నెలకొంది. త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి వద్ద ముగ్గురు యువకులు బైక్‌పై ప్రయాణిస్తూ.. అదుపు తప్పి కిందపడ్డారు. వీరిలో నాగిరెడ్డి అనే యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో మృతి చెందాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే దొనకొండ మండలం గుట్టమీదపల్లికి చెందిన పిక్కిలి తరుణ్(13) నీటి కుంటలో పడి మృతి చెందాడు.
News April 7, 2025
దొనకొండ: నీటి కుంటలో పడి బాలుడి మృతి

దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు… బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
News April 6, 2025
ఒంగోలు: పూర్తయిన ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

ఒంగోలు నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగిసింది. మార్కుల మొత్తం జాబితాను తయారు చేసి కంప్యూటరీకరణ కూడా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. కాగా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనేవి చూసి తప్పులు ఉంటే వాటిని సరిచేస్తున్నామని తెలిపారు. కాగా ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదలవుతాయని అధికారులు ఇప్పటికే తెలిపారు.