News July 7, 2025

కొండమడుగు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

బీబీనగర్ మండలం కొండమడుగులో అక్రమాలపై కలెక్టర్ హనుమంత రావు సీరియస్ అయ్యారు. గ్రామపంచాయతీలో పలు అక్రమాలకు పాల్పడిన పంచాయతీ సెక్రటరీ అలివేలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండల పంచాయతీ అధికారి, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి మాజీద్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు.

Similar News

News July 8, 2025

కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతాం: సీతక్క

image

వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న ఈ గుట్టలు ఎన్నో జలపాతాలకు, అటవీ సంపదకు, వన్యప్రాణులకు నిలయంగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతం పర్యాటక రంగంగా అభివృద్ధి చెందితే వెంకటాపురం, వాజేడు ప్రాంతాలు పర్యాటక హబ్‌గా మారుతాయన్నారు.

News July 8, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.