News February 9, 2025

కొండరెడ్ల అభ్యున్నతికి సహకారం: భద్రాద్రి కలెక్టర్

image

కొండరెడ్ల కుటుంబాలను గుర్తించి వారు జీవనోపాధి పెంపొందించుకొని ఆర్థికంగా అభ్యున్నతి చెందడానికి కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలోని కొండరెడ్ల గిరిజన కుటుంబాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌తో కలిసి ఇంటింటికీ తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి వెంట జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 4, 2025

విశాఖలో భూప్రకంపనలు

image

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.

News November 4, 2025

రబ్బర్ బోర్డ్‌లో 51 పోస్టులకు నోటిఫికేషన్

image

<>రబ్బర్ బోర్డ్‌<<>>లో 51 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BSc, MSc, PhD, బీటెక్, BE, ME, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు గ్రూప్ ఏ పోస్టులకు రూ.1500, గ్రూప్ బీ పోస్టులకు రూ.1000, గ్రూప్ సీ పోస్టులకు రూ.500. SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://recruitments.rubberboard.org.in/

News November 4, 2025

కాకినాడ: జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

image

కాశీబుగ్గ తొక్కిసలాట నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పిఠాపురం, సామర్లకోటలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఆయన వారితో ఫోన్‌లో మాట్లాడారు. కాశీబుగ్గ తొక్కిసలాట దృష్ట్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.