News March 30, 2025
కొండాపురం : తల్లిదండ్రుల మృతి.. అనాధలుగా పిల్లలు..!

కొండాపురంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగి రామ్మోహన్, సరోజ దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. మిగిలిన కుమార్తె బీటెక్ సెకండ్ ఇయర్, కొడుకు ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. వీరు అద్దె ఇంట్లో ఉంటున్నారు. దీంతో పిల్లలు అనాధలుగా మిగిలారని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.
Similar News
News April 1, 2025
బ్రహ్మంగారిమఠంలో ఇరువర్గాల దాడి

బ్రహ్మంగారిమఠం గ్రామంలో సోమవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. భూతగాదాతో ఘర్షణ జరిగింది. మల్లికార్జున్ రెడ్డి, జయరాం రెడ్డి, అతని తండ్రిపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యుల పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
News April 1, 2025
కడప జిల్లాలో కరవు మండలాలు ఇవే..!

రాష్ట్ర వ్యాప్తంగా కరవు మండలాలను గుర్తిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం కడప జిల్లాలో 10 మండలాల్లో కరవు ఉందని తేలింది. దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, అవధూత కాశీనాయన, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైలవరం, తొండూరు, మైదుకూరును కరవు మండలాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు ఉత్తర్వులు రాగా.. ఆయా మండలాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.
News April 1, 2025
సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట టీటీడీ పరిపాలన భవన సమావేశ మందిరంలో ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మంతో కలిసి బ్రహ్మోత్సవాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై కలెక్టర్ సూచనలు చేశారు.