News May 10, 2024

కొండాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొండాపురం మండలం పి.అనంతపురం దగ్గరలో చిత్రావతి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరుకు చెందిన సి.శివకుమార్(18) శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై తన గ్రామానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొండాపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 16, 2025

కడప: ఇక పట్నం పోదాం..!

image

ఉమ్మడి కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. రాయచోటి నేతాజీ సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బస్సుల కోసం ఇలా ప్రయాణికులు వేచి చూశారు.

News January 16, 2025

తిరుమలలో కడప బాలుడి మృతి

image

తిరుమలలో కడప బాలుడు చనిపోయాడు. చిన్నచౌక్ ఏరియాకు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు 13వ తేదీన తిరుపతికి వెళ్లారు. వాళ్లకు 16వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించారు. ఈక్రమంలో తిరుమల బస్టాండ్ సమీపంలో లాకర్ తీసుకున్నారు. నిన్న సాయంత్రం వారి రెండో కుమారుడు సాత్విక్ శ్రీనివాస్ రాజు(3) ఆడుకుంటూ రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. కొండపై ఉన్న అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

News January 15, 2025

యర్రగుంట్లలో సంక్రాంతి రోజు అపశ్రుతి

image

యర్రగుంట్లలోని 5వ వార్డులో జయంత్‌ అనే ఐదేళ్ల బాలుడు విద్యుత్ తీగలు తగిలి మంగళవారం గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే నాగిరెడ్డి ఇంటిపై 33KV విద్యుత్ తీగలు కిందికున్నాయి. ఆ మిద్దెపైన ఆడుకుంటున్న జయంత్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు బాబును ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఇదే క్రమంలో నాగిరెడ్డి ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి నష్టం వాటిల్లింది.