News May 1, 2024

కొండాపురం: వడదెబ్బతో యువకుడి మృతి

image

కొండాపురం మండలం బురుజుపల్లెకు చెందిన రాచుమల్లు మల్లారెడ్డి (30) వడ దెబ్బతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు..  గ్రామానికి చెందిన శివమల్లారెడ్డి మంగళవారం ఉదయం తోటకు వెళ్లే దారిలో ఎండ తీవ్రతకు స్పృహ కోల్పోయాడు. తాడిపత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News September 8, 2025

కడప జిల్లాలో 11,628 ఎకరాల్లో ఉల్లి సాగు

image

కడప జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 11,628 ఎకరాల్లో రైతులు ఉల్లిపంట సాగు చేశారు. వీరపునాయునిపల్లె, మైదుకూరు, దువ్వూరు, వేముల, తొండూరు, వేంపల్లి, ముద్దనూరు మండలాల్లో ఎక్కువగా ఉల్లిపంటను సాగు చేశారు. ఈనెల 10కి 655 ఎకరాల్లో, 17కి 1,265, 24కి 3,674, అక్టోబర్ 1కి 3,206, అక్టోబర్ 7కి 2,828 ఎకరాల్లో ఉల్లి పంట కోతకు వస్తుందని ఉద్యానశాఖ DD రవిచంద్ర తెలిపారు.

News September 8, 2025

YVU లలితకళా విభాగం స్కాలర్ సుజాతకు స్పెయిన్ దేశం ఆహ్వానం

image

YVU లలితకళా విభాగం స్కాలర్ సుజాతకు 2026 మేలో స్పెయిన్లో జరుగనున్న అంతర్జాతీయ సెమినార్‌కు నిర్వాహకులు ఫెర్నాండెజ్ ఈమెయిల్ ద్వారా ఆహ్వానించారు. ఈ పర్యటనకు వీసా ఇతరా ఖర్చులు భరిస్తామని వారు తెలిపారు. సుజాత ఫైన్ ఆర్ట్స్ హెడ్ డా.కోట మృత్యుంజయ రావు మార్గదర్శకత్వంలో ‘విజయనగర పెయింటింగ్స్’ మీద పరిశోధన చేస్తున్నారు. VC శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ప్రొ.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ.పద్మ ఆమెను అభినందించారు.

News September 8, 2025

ఉల్లిని ప్రభుత్వమే కొంటుంది: మైదుకూరు AMC ఛైర్మన్

image

ఉల్లి సాగు చేసిన రైతులు దళారులను నమ్మవద్దని, మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మైదుకూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏపీ రవీంద్ర చెప్పారు. పెద్ద బళ్లారి రకం ఉల్లి పంట చేతికొచ్చిందని.. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరగా అమలయ్యేలా చూస్తామన్నారు.