News April 14, 2025

కొండాపూర్:ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

image

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తిరిగి పాఠశాలల జూన్ 12న పున ప్రారంభమవుతాయని చెప్పారు. అన్ని పాఠశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. nవేసవి సెలవులో తరగతులు నిర్వహించవద్దని పేర్కొన్నారు.

Similar News

News April 15, 2025

BREAKING: ఈ నెల 26న అకౌంట్లోకి రూ.20,000

image

AP: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేపల వేట నిషేధ సమయంలో వారికి అందించే రూ.10,000 సాయాన్ని రూ.20,000కు పెంచుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ నెల 26న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ సాయం అందిస్తామన్నారు. ఓ మత్స్యకార గ్రామంలో సీఎం పర్యటిస్తారని, త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేస్తామని నిమ్మల పేర్కొన్నారు.

News April 15, 2025

భువనగిరి: ఆర్మీ ఉద్యోగాల భర్తీ: సాహితీ

image

సైన్యంలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ తెలిపారు. అర్హత, అసక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు విద్యార్హతల సర్టిఫికెట్లు తప్పనిసరిగా జతపర్చాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 15, 2025

APR 17న IPLలో 300 స్కోర్.. స్టెయిన్ ప్రిడిక్షన్ వైరల్

image

వాంఖడే వేదికగా ఎల్లుండి SRH-MI మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ మార్చి 23 చేసిన ఓ ప్రిడిక్షన్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘ఏప్రిల్ 17న జరిగే మ్యాచ్‌లో ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి 300 స్కోర్‌ను చూడబోతున్నాం. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అది చూడటానికి నేను కూడా అక్కడ ఉండొచ్చు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో స్టెయిన్ అంచనా నిజమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

error: Content is protected !!