News April 3, 2025

కొండాపూర్ ఆర్ఐ సస్పెండ్.. తహశీల్దార్ బదిలీ

image

వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరులో అవకతవలకు పాల్పడిన కొండాపూర్ ఆర్ఐ మహదేవుని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బుధవారం ఉత్తరుడు జారీ చేశారు. తహశీల్దార్ అనితను నారాయణఖేడ్ ఆర్టీవో కార్యాలయం బదిలీ చేశారు. ఆర్ఐ తప్పుడు నివేదిక ఆధారంగా వారసత్వ బదిలీ సర్టిఫికెట్ ఇచ్చారని కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేయించిన కలెక్టర్ వాస్తవమని తేలడంతో సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు.

Similar News

News November 10, 2025

రబీ.. చౌడు నేలలకు అనుకూలమైన వరి రకాలు

image

☛ M.T.U 1293: సన్నగింజ రకం. పంట కాలం 120 రోజులు. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. చౌడు నేలలకు అత్యంత అనుకూలం. దిగుబడి సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు భూమిలో 2.0-2.5 టన్నులు
☛ జగిత్యాల రైస్-1(JGL-24423): పంటకాలం 120-125 రోజులు. దొడ్డుగింజ రకం. దిగుబడి ఎకరాకు 30-35 క్వింటాళ్లు. ఆరుతడి, నేరుగా విత్తే పద్ధతులకు అనుకూలం. సుడిదోమను, చలి ఉద్ధృతిని, చౌడును కొంతమేర తట్టుకుంటుంది.

News November 10, 2025

శివాలయంలో ఇలా చేస్తున్నారా?

image

శివాలయంలో తెలియక మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. అయితే కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
1. నందీశ్వరుడికి, శివునికి మధ్య నడవకూడదు. ఎందుకంటే నంది చూపు శివుడిపై స్థిరంగా ఉండాలి.
2. శివలింగానికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు.
3. శివాలయంలో ప్రదక్షిణ నియమాలు వేరుగా ఉంటాయి. గుడి చుట్టూ తిరిగకూడదు. సోమసూత్రాన్ని దాటకుండా.. అక్కడి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం వద్దకు రావాలి.

News November 10, 2025

జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు

image

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 77 ప్రత్యేక బృందాలతో హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని సంతపేట పరిధిలోని ఓ లాడ్జ్‌లో ఆకస్మిక తనిఖీ చేయగా, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 6 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి లాడ్జిలు, హోటల్స్‌ను ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు.