News April 5, 2025

కొండాపూర్: నమోదు పెంచే బాధ్యత HMలదే: డీఈవో

image

ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు పెంచే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. మల్కాపూర్‌లో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల శిక్షణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో సాంకేతికను ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రాథమిక విద్యార్థులకు ఆటపాటలతో బోధన చేసేలా చూడాలని పేర్కొన్నారు.

Similar News

News March 1, 2026

నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు నిర్వహణ పనుల కారణంగా పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. మార్చి 7వ తేదీ వరకు రద్దు చేశారు. కాచిగూడ – నిజామాబాద్ (77601), నిజామాబాద్ – కాచిగూడ (77602), నిజామాబాద్ – నాందేడ్ (77645), నాందేడ్ – నిజామాబాద్ (77646) రైళ్లు రద్దయ్యాయి.

News March 1, 2026

MNCL: ‘రాయితీపై డ్రోన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలి’

image

మంచిర్యాల జిల్లాలో రాయితీపై డ్రోన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ తెలిపారు. 2025- 26 సంవత్సరానికి గాను జిల్లాకు 10 వ్యవసాయ డ్రోన్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో మంచిర్యాల డివిజన్ కు 3, చెన్నూర్ కు 3, బెల్లంపల్లికి 2, భీమినికి 2 డ్రోన్లు కేటాయించామన్నారు. తెలిపారు. ఈ డ్రోన్లను 40 శాతం (రూ.4 లక్షల) రాయితీపై అందించనునట్లు తెలిపారు.

News March 1, 2026

ఖమేనీ చనిపోయారు.. ఆయన బాడీ దొరికింది: ఇజ్రాయెల్ అధికారి

image

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయారని ఇజ్రాయెల్ అధికారి ధ్రువీకరించినట్లు రైటర్స్ సంస్థ వెల్లడించింది. ఆయన బాడీని కూడా గుర్తించినట్లు ఆ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఆధారాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుకు అధికారులు చూపించినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంటోంది. కాగా ఖమేనీ క్షేమంగానే ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ చెబుతూ వస్తోంది.