News January 13, 2026

కొండాపూర్: ‘వేసవికి తగ్గట్టుగా బీరు ఉత్పత్తి చేపట్టండి’

image

కొండాపూర్ మండలం మల్లేపల్లి బీరు, మద్యం తయారీ కంపెనీలను ఎక్సైజ్ సెక్రెటరీ రఘునందన్ రావు, కమిషనర్ సి.హరికిరణ్ సోమవారం పరిశీలించారు. వేసవి అవసరాలకు తగ్గట్టుగా బీర్ కంపెనీలు తమ ఉత్పత్తులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. బీర్ తయారీ విధానాన్ని పరిశీలించి పాటించావాల్సిన ప్రమాణాలు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 21, 2026

జగిత్యాల: మార్చి 14 నుంచి SSC పరీక్షలు

image

మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని, తాగునీరు, విద్యుత్, బెంచీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రశ్నపత్రాల రవాణా, OMR షీట్ల నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

News February 21, 2026

GNT: శనగ రైతులకు జాయింట్ కలెక్టర్ సూచన

image

జిల్లాలో శనగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు JC అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. రబీ 2025-26లో శనగ సాగు చేసిన రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 5,875 ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. 13 మండలాల్లో సుమారు 16,600 హెక్టార్లలో శనగ పంట సాగు చేయగా, 45 వేలమెట్రిక్ టన్నుల అంచనా ఉందన్నారు.

News February 21, 2026

ఏఐ సమ్మిట్‌పై జగన్ నకిలీ సానుభూతి: లోకేశ్

image

AP: AI సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతల నిరసనలను <<19201240>>ఖండించిన<<>> YCP చీఫ్ జగన్‌కు మంత్రి లోకేశ్ కౌంటరిచ్చారు. ‘2017లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు అంతరాయం కలిగించడానికి ఎయిర్‌పోర్టులో ధర్నా చేశారు. 2019లో గ్లోబల్ ఇన్వెస్టర్లతో విద్యుత్ ఒప్పందాలను, 2020లో అమరావతి-సింగపూర్ ఒప్పందాన్ని రద్దు చేశారు. 2025లో రుణాలు రాకుండా RBIకి లేఖ రాశారు. ఇప్పుడు AI సమ్మిట్‌పై నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.