News October 26, 2025

కొండారెడ్డిపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 38.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగల 32.8, కొండనాగుల, పెద్దుర్ 32.0, పదర 20.5, అచ్చంపేట 18.8, తిమ్మాజిపేట17.5, వంకేశ్వర్ 16.8, మంగనూర్ 4.5, యంగంపల్లి 3.5, తెల్కపల్లి 2.8, అత్యల్పంగా సిర్సనగండ్ల, ఐనోల్‌లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News October 26, 2025

3 రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సిసోడియా

image

‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ ఆర్.పి. సిసోడియా ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తదితరులు పాల్గొన్నారు.

News October 26, 2025

తాజా వార్తలు

image

☛ WWC: వర్షం వల్ల భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు అంతరాయం
☛ రేపు 4.15PMకు భారత ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్.. దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలుపై ప్రకటించే ఛాన్స్
☛ కర్నూలు ప్రమాదం: DNA పరీక్షలో 19వ వ్యక్తి మృతదేహం గుర్తింపు.. చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు అని అధికారుల ప్రకటన
☛ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ సమాప్తం: మంత్రి తుమ్మల

News October 26, 2025

ఖమ్మం: ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతులకు ఉమెన్స్ టైలరింగ్, మగ్గం(ఎంబ్రాయిడరీ), బ్యూటిషన్‌పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 5వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.