News April 13, 2025
కొండారెడ్డిపల్లిలో మౌలిక వసతుల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

వంగూర్ మండలంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. సీఎం సొంత గ్రామంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీయన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కలసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామ రహదారి విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాల్సిందిగా సూచనలు చేశారు. పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Similar News
News April 5, 2026
చిత్తూరు: రూ.273 కోట్ల బకాయిల విడుదల

జడ్పీ పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యనిధి (పీఎఫ్)కి సంబంధించి మార్చి నెలాఖరు వరకు ఉన్న బకాయిలు రూ.273 కోట్లను వారి ఖాతాలో జమ చేసినట్టు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు తెలిపారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రుణాలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి అందజేసే తుది మొత్తాల పూర్తి బకాయిలను ప్రభుత్వం జమ చేసిందన్నారు. ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు పరిష్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు.
News April 5, 2026
TG EAPCETకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే

తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల (లేట్ ఫీజు లేకుండా) గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 53.34% మంది అమ్మాయిలు, 46.66% మంది అబ్బాయిలు ఉన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమింగ్‌కు 2,03,167 అప్లికేషన్లు వచ్చాయి. నేటి నుంచి ఈ నెల 10 వరకు రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు EAPCET <
News April 5, 2026
తొర్రూర్: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన MHBD జిల్లా తొర్రూరు(M) హరిపిరాలలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పులిగుజుల అనూష (22)ను ఆమె భర్త సాయి తరచూ అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష, శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుంది. అనూష తండ్రి ఫిర్యాదు మేరకు సాయిపై ఎస్సై ఉపేందర్ కేసు నమోదు చేశారు.


