News October 16, 2025
కొండా దంపతుల భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

మంత్రి పొంగులేటితో మొదలైన లొల్లి సుమంత్ విషయం వరకు వెళ్లి సీఎంను కూడా తాకింది. తమపై రెడ్లు కుట్ర చేస్తున్నారంటూ సుష్మిత ఆరోపించగా.. సుమంత్ విషయం తనకేమీ తెలియదని మురళి తెలిపారు. హన్మకొండలోని సురేఖ ఇంటివద్ద పోలీస్ అవుట్ పోస్టునూ తొలగించారు. మరోవైపు ఇవాళ కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ ఉండగా.. మురళి మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Similar News
News October 16, 2025
ADB: కొత్తవారికే హస్తం పగ్గాలు..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు డీసీసీ అధ్యక్ష పదవుల నియామకం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. కొత్త వారికి అవకాశం కల్పించాలని అధిష్ఠానం యోచిస్తుండటంతో, పదవుల్లో కొనసాగుతున్న పాత నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్గ పోరు, ఆశావహుల సంఖ్య పెరగడంతో ఏకాభిప్రాయం కష్టంగా మారింది. ఈ అంశంపై ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటిస్తూ, నేతల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
News October 16, 2025
KNR: మారనున్న స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు BC రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పేరుతో దాదాపుగా రిజర్వేషన్లలో మార్పు తెచ్చింది. అయితే ఇటీవల కలిసొచ్చిన రిజర్వేషన్లతో అవకాశం ఉన్న ఆశావహులు ఇప్పటికే ఖర్చు పెడుతున్నారు. కానీ 50% నిబంధనతో మళ్లీ రిజర్వేషన్లు మారుతాయని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,216 GPలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.
News October 16, 2025
గొల్లపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

గొల్లపెల్లి మండలం తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మీసేవా సర్టిఫికెట్లు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట ఆర్డిఓ మధుసూదన్ తదితరులున్నారు.