News October 15, 2025
కొండా సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలకు ఆయనే కారణమా?

మంత్రి కొండా సురేఖ OSD సుమంత్‌ను పీసీబీ టర్మినేట్ చేయగా.. దేవాదాయ, అటవీశాఖ విభాగాల పరిపాలనలో తన స్థానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. మేడారం అభివృద్ధికి కాంటాక్ట్ పనులను అప్పగించడంలో సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య విభేదాలు సృష్టించడంలో సుమంత్ పాత్ర ఉందనీ అనుమానం వ్యక్తంచేశారు. కాగా, DEC 2023లో OSDగా నియమితులైన సుమంత్ కాంట్రాక్టును 2025 చివరివరకు పొడిగించగా తాజాగా<<18008160>> వేటుపడింది<<>>.
Similar News
News October 15, 2025
నగరిలో దారుణ హత్య

రూ.1.25 కోట్ల నగదు కోసం గుణశీలన్(65)ను హత్య చేసి డెడ్ బాడీని ముక్కలు చేసి చెరువులో పడేశారు. నగరి పట్టణం కొత్తపేటకు చెందిన గుణశీలన్‌కు విజయ్‌తోపాటు ముగ్గురు సంతానం. విజయ్‌కు అదేఊరిలోని గంగాధరం కూతరు కౌలస్యతో పెళ్లి జరిగింది. కుటుంబ సమస్యలతో 6 నెలలకే విజయ్ సూసైడ్ చేసుకున్నాడు. ఆయన పేరు మీద వచ్చిన రూ1.25 కోట్ల ఇన్సూరెన్స్ నగదు కోసం గంగాధరంతోపాటు మరోవ్యక్తి గుణశీలన్ను హత్య చేసినట్లు పోలీసులుతెలిపారు.
News October 15, 2025
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 332.53 మీటర్లు (80.5 టీఎంసీలు)గా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 22,290 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 4 గేట్లు తెరిచి సమానంగా 22,290 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సరస్వతి, కాకతీయ, లక్ష్మీ కాల్వల ద్వారా సాగునీటి విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు.
News October 15, 2025
మానవత్వం చాటుకున్న ఎంపీ, ఎమ్మెల్యే శ్రావణి

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మానవత్వం చాటుకున్నారు. శింగనమల మండలం నాయనపల్లి క్రాసింగ్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్లూరు మండలం సూరేపల్లి గ్రామ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వస్తున్న వారు ఘటనను చూసి చలించిపోయారు. వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసిన మృతదేహాన్ని తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.