News March 23, 2024

కొండేపి ఎమ్మెల్యేకు మాతృవియోగం

image

కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తల్లి సుబ్బమ్మ (83)అనారోగ్యంతో శనివారం సాయంత్రం కన్నుమూశారు. డోలా సుబ్బమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె తుది శ్వాస విడిచారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఆదివారం సుబ్బమ్మ అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News February 6, 2025

ప్రకాశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

image

జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం రాత్రి వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించరాదని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

News February 6, 2025

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కలెక్టర్

image

పీసీపల్లి మండలం వాటర్ షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి బుధవారం కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహరెడ్డితో కలిసి ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, MLA మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్నారు.

News February 5, 2025

error: Content is protected !!