News July 9, 2025
కొంపల్లి రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్ దందా

HYDలో డ్రగ్స్ మాఫియా గట్టును మరోసారి ఈగల్ టీమ్ బట్టబయలు చేసింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ రాకెట్‌ను నడుపుతున్న ముఠాను పట్టుకుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో ఈ దందా సాగుతోందని పోలీసులు తెలిపారు. సూర్య 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు.
Similar News
News July 10, 2025
ప్రకాశం బ్యారేజ్‌కి వరద

ప్రకాశం బ్యారేజీ వద్దకు బుధవారం సాయంత్రం నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారిక లెక్కల ప్రకారం బుధవారం 1,47,939 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో పవర్ హౌస్ ద్వారా 67,233 క్యూసెక్కులు, స్పిల్ వే నుంచి 80,646 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఇక శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 1.69 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు
News July 10, 2025
ASF: మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా మాధ్యమిక అధికారిణి కళ్యాణితో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపళ్లతో సమీక్ష నిర్వహించారు.
News July 9, 2025
జగిత్యాల: ‘మహిళల ఆర్థిక ప్రగతి కోసం ఇందిరా మహిళా శక్తి సంబరాలు’

మహిళల ఆర్థిక ప్రగతి కోసం ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఓ రఘువరన్ అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల కిశోర బాలికలతో సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళా సంఘాలు సాధించిన విజయాలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఓదెల గంగాధర్ పాల్గొన్నారు.