News February 4, 2025

కొంపల్లి: సోదరి చిత్రపటానికి KCR నివాళి

image

కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ దశదిన కర్మకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సోదరి సకలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. నేడు కేసీఆర్ సహా BRS స్థానిక శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై, నివాళులర్పించారు.

Similar News

News November 6, 2025

రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు?

image

AP: రాష్ట్రంలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటుకానున్నట్లు సమాచారం. అలాగే నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

News November 6, 2025

ఖమ్మం: మంత్రులు, ఎమ్మెల్యేలు జర పట్టించుకోండి..!

image

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అధ్వాన రహదారులు ప్రజలను కలవరపెడుతున్నాయి. జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ఏడుగురు MLAలు ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి గుంతలమయమైన రోడ్లకు పునఃనిర్మాణం/మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా సరిహద్దు కావడంతో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News November 6, 2025

జీరో టిల్లేజి సాగు విధానం – ఏ పంటలకు అనుకూలం?

image

వరి కోత యంత్రంతో పైరును కోశాక దుక్కి చేయకుండా ఇతర పంట విత్తనాలను విత్తే పద్ధతిని జీరో టిల్లేజి సాగు పద్ధతి అంటారు. ఇది మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు, శనగకు అనుకూలం. ఈ పద్ధతిలో విత్తేటప్పుడు చాలినంత తేమ నేలలో లేకపోతే ఒక తడి ఇచ్చి విత్తుకొవడం మంచిది. విత్తనాలను చేతితో విత్తే పరికరాలతో నాటితే సమయం ఆదా అవుతుంది. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ ఉండేట్లు విత్తుకోవాలి.