News January 25, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ITI, డిప్లొమా, BSc(MPC/CS)అర్హత గలవారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 28వరకు పంపాలి. వయసు 18 నుంచి 36ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.22,240, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.31,020 చెల్లిస్తారు. సైట్: https://recruit.cusat.ac.in
Similar News
News February 6, 2026
DGEMEలో ఉద్యోగాలు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 6, 2026
వంటింటి చిట్కాలు

* వడియాల పిండిలో కాస్త నిమ్మరసం వేస్తే వడియాలు తెల్లగా వస్తాయి.
* కూరగాయలు ఉడికించాక రంగు పోకుండా ఉండాలంటే నీళ్లలో చిటికెడు పసుపు, చెంచా ఆలివ్ ఆయిల్ వెయ్యాలి.
* నిల్వ పచ్చళ్లు భద్రపరిచే ముందు ఆ డబ్బాలో కాస్తంత ఇంగువ కాల్చి, వెయ్యాలి.
* చేప ముక్కల్ని నిల్వ చెయ్యాలంటే వాటికి కాస్త ఉప్పు రాసి డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. దానివల్ల ముక్కలు మంచు పేరుకుపోకుండా, తాజాగా ఉంటాయి.
News February 6, 2026
గల్ఫ్ దేశాలతో మెగా ట్రేడ్ డీల్‌కు సిద్ధమైన భారత్

ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్స్ కొనసాగుతున్న వేళ భారత్ వరుస వాణిజ్య ఒప్పందాలతో దూసుకుపోతోంది. EU, USA తర్వాత ఇప్పుడు గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (GCC)లోని 6 దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు చర్చలు మొదలు పెట్టింది. ఈ ఒప్పందం కుదిరితే ఎగుమతులు, పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. UAE, ఒమన్‌తో ఇప్పటికే డీల్స్ అమల్లో ఉండగా సౌదీ, ఖతర్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలతోనూ సంబంధాలు బలపడనున్నాయి.


