News February 18, 2026

కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

image

<>కొచ్చిన్ <<>>యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 7 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా, BSc(MPC/CS)అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 28వరకు పంపాలి. వయసు 18 నుంచి 36ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.22,240, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.31,020 చెల్లిస్తారు. https://recruit.cusat.ac.in

Similar News

News February 18, 2026

CSIR-IICBలో ఉద్యోగాలు

image

కోల్‌కతాలోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(I<>ICB<<>>) 9 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(నేచురల్ /అగ్రికల్చర్ సైన్సెస్/MVSc/ఎనిమల్ సైన్సెస్/ఫార్మాస్యూటికల్ సైన్సెస్), BSc(హానర్స్), MSc, PhD, BE/BTech, MCA, NET/SET అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 27న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వెబ్‌సైట్: https://iicb.res.in

News February 18, 2026

కాంగ్రెస్‌లో రాజ్యసభ సీట్లు దక్కేదెవరికో?

image

TG: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డంతో రాష్ట్రంలోని 2 సీట్లు ఎవరికి దక్కుతాయనే చర్చ జోరందుకుంది. MLAల సంఖ్య ప్రకారం INCకే ఇవి దక్కవచ్చంటున్నారు. ఆ పార్టీ నుంచి K.కేశవరావు, అభిషేక్ సింఘ్వీ, జీవన్ రెడ్డి, హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో BRS RS సభ్యుడిగా ఉన్న KK రాజీనామా చేసి INCలో చేరారు. VH, జీవన్, సుదర్శన్‌లు సీనియర్లు. సింఘ్వీ AICCలో కీలకంగా ఉన్నారు.

News February 18, 2026

వరి పంటలో ఎలుకల నిర్మూలనకు అనుకూల సమయం ఏది?

image

వరిలో నాట్లు వేసిన తర్వాత ఎలుకల నిర్మూలన చేపట్టడం సులభమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో బుట్టలను పెడితే ఎలుకలను సులభంగా నిర్మూలించవచ్చంటున్నారు. పంట చిరుపొట్ట దశలో ఎలుకల నిర్మూలన కష్టంగా మారుతుందని, ఈ సమయంలో బుట్టలతో వాటిని అరికట్టలేమని చెబుతున్నారు. చిరు పొట్ట దశలో ఎలుక కన్నాలను గుర్తిస్తే, పొగ బెట్టడం ద్వారా వాటిని కంట్రోల్ చేయొచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.